ఏపీలో పదవ తరగతి పరీక్ష ఫలితాలు విడుదల

నవతెలంగాణ-హైదరాబాద్ : ఏపీ పదవ తరగతి పరీక్ష ఫలితాలు విడుదల అయ్యాయి. విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ విజయవాడలో టెన్త్ రిజల్ట్స్‌ను రిలీజ్ చేశారు. అఫిషీయల్ వెబ్ సైట్ ద్వారా విద్యార్థులు ఫలితాలను చూసుకోవచ్చని తెలిపారు. మొత్తం 6.18 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. 86.69 శాతం ఉత్తీర్ణత నమోదు అయ్యింది. బాలురు 84.32, బాలికలది 89.17 శాతం పాస్ పర్సంటేజ్ నమోదు అయ్యింది. టెన్త్ ఫలితాలు బాలికలే పై చేయి సాధించారు.

Spread the love