21 నుంచే ఏపీ అసెంబ్లీ సమావేశాలు..

నవతెలంగాణ – అమరావతి: ఈ నెల 21 నుంచే ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. 21, 22 తేదీల్లో అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రెండు రోజుల్లో సభ్యుల ప్రమాణ స్వీకారం, సభాపతి ఎన్నిక జరగనుంది. అంతకుముందు శాసనసభ సమావేశాలు ఈ నెల 24న ప్రారంభం కానున్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. తాజాగా తేదీల్లో మార్పులు చోటుచేసుకున్నాయి.

Spread the love