24 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు..

నవతెలంగాణ – అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈనెల 24 నుంచి ప్రారంభం కానున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి 26వ తేదీ వరకు మూడు రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. వాస్తవానికి 19 నుంచి సమావేశాలు జరగాల్సి ఉండగా.. గవర్నర్ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ బక్రీద్ పండుగ సందర్భంగా సెలవుల్లో ఉండటంతో అసెంబ్లీ సమావేశాల తేదీల్లో మార్పులు జరిగాయి. 24న ప్రొటెం స్పీకర్‌ను ఎన్నుకున్న తర్వాత నూతనంగా ఎన్నికైన శాసనసభ్యుల ప్రమాణ స్వీకారం జరగనుంది.

Spread the love