సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ క్యాబినెట్ భేటీ..

నవతెలంగాణ – అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన ఈ ఉదయం రాష్ట్ర క్యాబినెట్ సమావేశమయింది. ఈ భేటీకి మంత్రులంతా హాజరయ్యారు. ఈ భేటీలో పలు కీలక అంశాలకు ఆమోదం తెలిపారు.
క్యాబినెట్ నిర్ణయాలు:
– 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ఓటాన్ అకౌంట్ ను ఆమోదించిన క్యాబినెట్.
– నంద్యాల జిల్లా డోన్ లో హార్టికల్చర్ ఫుడ్ ప్రాసెసింగ్ పాలిటెక్నిక్ కాలేజి ఏర్పాటుకు ఆమోదం. వైఎస్సార్ హార్టికల్చర్ యూనివర్శిటీ కింద పని చేయనున్న పాలిటెక్నిక్ కాలేజీ.
– డోన్ లో వ్యవసాయ పాలిటెక్నిక్ కాలేజీ ఏర్పాటుకు ఆమోదం. ఈ కాలేజీ ద్వారా వ్యవసాయరంగంలో రెండేళ్ల డిప్లొమో కోర్సు. ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్శిటీ కింద పని చేయనున్న కాలేజీ.
– అన్నమయ్య జిల్లాలో అన్నమాచార్య యూనివర్శిటీ, కాకినాడ జిల్లా సూరంపాలెంలో ఆదిత్య యూనివర్శిటీ, తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో గోదావరి గ్లోబల్ యూనివర్శిటీల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్.
– ఏపీ ప్రైవేట్ యూనివర్శిటీస్ యాక్ట్ 2016కి సవరణలు చేయడం ద్వారా బ్రౌన్ ఫీల్డ్ కేటగిరీలో ఈ మూడు యూనివర్శిటీల ఏర్పాటుకు అనుమతి.
– శాసనసభలో ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్ ప్రసంగానికి ఆమోదం తెలిపిన క్యాబినెట్.

Spread the love