తిరుమలలో ఏపీ సీఎం చంద్రబాబు కుటుంబం..

నవతెలంగాణ-హైదరాబాద్ : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అంతకుముందు, సీఎంకు టీటీడీ జేఈఓ గౌతమి, ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. చంద్రబాబు వెంట ఆయన అర్ధాంగి భువనేశ్వరి, కుమారుడు లోకేశ్, కోడలు బ్రాహ్మణి, మనవడు దేవాన్ష్ ఉన్నారు. సీఎంను చూసేందుకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్దకు టీడీపీ కార్యకర్తలు, నాయకులు భారీగా తరలివచ్చారు.

Spread the love