నవతెలంగాణ – అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన కొనసాగుతోంది. ప్రపంచ ఆర్థిక సదస్సులో భాగంగా మూడోరోజు వివిధ దేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలతో ఆయన సమావేశం కానున్నారు. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ తో చంద్రబాబు భేటీ కానున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులపై ఆయనతో సీఎం చర్చించనున్నారు. యునీలీవర్, డీపీ వరల్డ్ గ్రూపు, పెట్రోలియం నేషనల్ బెర్హాద్ (పెట్రోనాస్), గూగుల్ క్లౌడ్, పెప్సీకో, ఆస్ట్రాజెనెకా సంస్థల సీఈఓలతోనూ సీఎం సమావేశం కానున్నారు.