స్కూళ్లకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కీలక ఆదేశాలు

నవతెలంగాణ-హైదరాబాద్ : స్కూళ్లలో స్వాతంత్ర్య దినోత్సవం, రిపబ్లిక్ డే వేడుకల నిర్వహణపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. అన్ని స్కూళ్ల విద్యార్థులకు ఆగస్టు 15, రాజ్యాంగ విలువ, స్థానిక సంస్థల పాలన లాంటి అంశాలపై వ్యాస రచన, క్విజ్, డిబేట్, ఆటల పోటీలు నిర్వహించాలని పంచాయతీల సర్పంచ్‌లకు నిర్దేశించారు. పిల్లలకు చాక్లెట్లు అందించి పారిశుద్ధ్యంపై మహాత్మాగాంధీజీ చెప్పిన మాటలతో ప్రమాణం చేయించాలని చెప్పారు.

Spread the love