నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ స్థానికత ఉన్న ఉద్యోగులను రిలీవ్ చేస్తూ ఏపీ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. విభజన సమయంలో కేటాయించిన 122 మంది నాన్‌గెజిటెడ్ ఉద్యోగులను స్వరాష్ట్రానికి పంపాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. తెలంగాణ అభ్యర్థనపై సానుకూలంగా స్పందించిన ఏపీ ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. రీలీవ్ అయ్యే వారు తమ కేడర్ చివరి ర్యాంక్‌లోనే విధుల్లో చేరతారని వెల్లడించింది.