ఏపీ గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌కు అస్వస్థత

నవతెలంగాణ -విజయవాడ : ఏపీ గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ అస్వస్థతకు గురయ్యారు. కడుపు నొప్పితో బాధపడుతున్న ఆయన గుంటూరు జిల్లా తాడేపల్లిలోని మణిపాల్‌ ఆస్పత్రిలో ఆయన చేరారు. కడుపు నొప్పి కారణంగా గవర్నర్‌ అస్వస్థతకు గురైనట్టు సమాచారం. రాజ్‌భవన్‌ అధికారుల నుంచి సమాచారం అందుకున్న వైద్యులు విజయవాడ వచ్చి గవర్నర్‌కు పరీక్షలు చేశారు. ఆస్పత్రిలో చేరాలని సూచించారు. వైద్య నిపుణుల సూచన మేరకు ఆస్పత్రిలో చేరిన గవర్నర్‌కు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.

Spread the love