నవతెలంగాణ – హైదరాబాద్: కృష్ణా జలాలను ఏపీ ఇష్టారాజ్యంగా తరలించుకుపోతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం చోద్యం చూస్తోందని కేటీఆర్ విమర్శించారు. నాగార్జునసాగర్ కుడి కాల్వ ద్వారా గత 3 నెలలుగా రోజుకు 10వేల క్యూసెక్కుల సామర్థ్యంతో ఇప్పటికే 646 టీఎంసీలను వినియోగించుకుందని ఆరోపించారు. కృష్ణా, గోదావరి నదుల్లో బొట్టు బొట్టును కాపాడి బీడు భూములను కేసీఆర్ సస్యశ్యామలం చేస్తే ఏడాది కాలంలోనే కాంగ్రెస్ పంటపొలాలను ఎండబెట్టిందని Xలో ఫైరయ్యారు.