ఏపీ ఇసుక మైనింగ్ పై సుప్రీం మార్గదర్శకాలు..

నవతెలంగాణ – అమరావతి: ఏపీ ఇసుక మైనింగ్‌ కేసుపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు మార్గదర్శకాలు విడుదల చేసింది. ప్రతి జిల్లాలో పోలీసు అధికారులతో కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారం కోసం ప్ర‌త్యేక‌ వ్యవస్థను ఏర్పాటు చేయాల‌ని సూచించింది. టోల్‌ఫ్రీ నంబర్‌, ఈమెయిల్‌ ఏర్పాటుతో విస్తృత ప్రచారం కల్పించాలంది. ఎన్జీటీ తీర్పులో పేర్కొన్న ప్రతి అంశాన్ని తు.చ తప్పక పాటిస్తూ, కోర్టు ఉత్తర్వులు పాటించని వారిపై ఉల్లంఘన చర్యలకు వెనుకాడొద్దని అత్యున్న‌త‌ న్యాయస్థానం స్పష్టం చేసింది. ఇక రాష్ట్రంలో ఇసుక మైనింగ్‌పై తదుపరి విచారణ జులై 15న చేపట్టనున్నట్లు సుప్రీంకోర్టు వెల్ల‌డించింది

ఇసుక మైనింగ్‌పై సుప్రీం మ‌రిన్ని మార్గదర్శకాలివే..
కేంద్రపర్యావరణశాఖ తరచూ తనిఖీలు చేపట్టాలి
తనిఖీల సమాచారం రాష్ట్ర అధికారులకు ఇవ్వనవసరంలేదు
కోర్టు ఉత్తర్వులు ఉల్లంఘిస్తే చర్యలకు వెనుకాడవద్దు
ఎన్జీటీ తీర్పులోని ప్రతి అంశం తప్పక పాటించాలి
కేంద్ర అధికారులు గుర్తించిన మైనింగ్‌ ప్రదేశాల వివరాలు రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాలి
మైనింగ్‌ జరిగిన ప్రదేశాలను కలెక్టర్లు తనిఖీ చేయాలి
ఉల్లంఘనలపై కేసులు నమోదు చేసి క్రిమినల్‌ చర్యలు చేపట్టాల
జులై 9లోపు ఆదేశాల అమలుపై కేంద్రం, రాష్ట్రం అఫిడవిట్‌ ఇవ్వాలి

Spread the love