రాజకీయాలకు అతీతంగా పేద ప్రజలకు విద్య, వైద్యం అందేలా చూడాలి..

– రూ.37 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్ ప్రారంభం: ఎమ్ ఎల్  సి ప్రభాకర్ రావు

నవతెలంగాణ – సుల్తాన్ బజార్ 
రాజకీయాలకు అతీతంగా పేద ప్రజలకు విద్య, వైద్యం అందేలా చూడాల్సిన భాధ్యత ప్రతి ఒక్క ప్రజా ప్రతినిధిపై ఉందని ఎమ్ ఎల్ సి ఎం.ఎస్ ప్రభాకర్ రావు అన్నారు. సోమవారం కోఠిలోని సుల్తాన్ బజార్ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో  ఎం ఎల్ సి ప్రభాకర్ రావు సీడీపీ కోటాలో 37 లక్షల రూపాయల నిధులతో నిర్మించిన నూతన వీడీసీసీ రోడ్డును ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని స్థానిక కార్పొరేటర్ డాక్టర్ సురేఖ ఓం ప్రకాష్ భీష్వ, దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ కె రాజ్యలక్ష్మీ, నాంపల్లి నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జి సీహెచ్ ఆనందకుమార్ గౌడ్, దిలీప్, మనోహర్ బాబులతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ‌‌.. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి ప్రభుత్వ ప్రసూతి దవాఖానాకు పీద గర్భిణీలు అత్యధిక సంఖ్యలో వస్తున్న తరుణంలో ఈ దవాఖానాలో వసతుల కల్పన కోసం రాజకీయాలకు అతీతంగా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రాజ్యలక్ష్మీ, ఆర్ ఎం ఓ సీహెచ్ ప్రభాకర్  లవిన్నపం మేరకు ఎం ఎల్ సి కోటాలో సీడీపీ నిధుల నుండి 37 లక్షల నిధులతో సీసీరోడ్డు నిర్మాణ పనులు చేపట్టడం జరిగిందని అన్నారు. తాను గత 14 ఏళ్ళుగా ఎంఎ ల్ సి గా కొనసాగుతున్నానని అన్నారు. పేద ప్రజలు అత్యధికంగా విచ్చేసే ప్రభుత్వ పాఠశాలల్లో, ప్రభుత్వ దవాఖానాలలో మంచి నీటి ఆర్వో ప్లాంట్లను, సీసీ రోడ్డు నిర్మాణ పనులను చేపట్టడం జరిగిందని అన్నారు. ఉస్మానియా, గాంధీ, నిలోఫర్, ఎం ఎన్ జే క్యాన్సర్, నల్లకుంట ఫీవర్ హాస్పిటల్, సుల్తాన్ బజార్ ప్రభుత్వ ప్రసూతి దవాఖాన, నిజాం కళాశాల తదితర ప్రాంతాలలో ఆర్వో ప్లాంట్లను, సీసీ రోడ్డు నిర్మాణ పనులను విజయవంతంగా పూర్తి చేయడం తనకెంతో సంతోషాన్నిస్తుందని అన్నారు. ఇదిలా ఉండగా సుల్తాన్బజార్ ప్ర ప్రభుత్వ ప్రసూతి దవాఖానాలో ఎస్ఎన్సీయూ వార్డు నుండి లేబర్ రూం వార్డుకు వెళ్ళేందుకు పూర్తిగా తిరిగి వెళ్ళాల్సిన పరిస్థితి ఉందని, ఈ ప్రాంతంలో ఒక ర్యాంప్ షెడ్ వేయడంతో ఇబ్బందులు తొలగిపోతాయని తెలపారని వివరించారు. త్వరతి గతిన సీడీపీ నిధుల నుండి పనులు పూర్త య్యేలా చూడాలని ఈఈకి తగిన సూచనలను చేశారు. తదనంతరం దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రాజ్యలక్ష్మీ, జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి నూతనంగా నిర్మించిన రోడ్డును పర్యవేక్షించారు. రోడ్డు కొంత భాగం మిగిలి ఉన్న ప్రాంతాన్ని పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. త్వరితగతిన పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. దవాఖానాలో పేద గర్భిణులకు ఎంతో మెరుగైన సేవలను అందిస్తున్న దవాఖానా సూపరింటెండెంట్, వైద్య సిబ్బందిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో దవాఖానా సూపరింటెండెంట్ డాక్టర్ రాజ్యలక్ష్మి , ఆర్ఎంఓ డాక్టర్ సీహెచ్ ప్రభాకర్, ఆర్డీవో మైపాల్ రెడ్డి,నాంపల్లి మండల తహసిల్దార్ ప్రేమ్ కుమార్, స్పెషల్ ఆర్ఐ అశ్విన్, వీఆర్ఓ నరసింహారెడ్డి,ఈ ఈ గురుప్రసాద్, నర్సింగ్ సూపర్డెంట్ సుజాత, హెడ్ నర్సింగ్ ఆఫీసర్ వెంకటలక్ష్మమ్మ, నర్సింగ్ ఆఫీసర్ లు మంజుల, స్వప్న సందేశిని, బాలరాజ్, విజయ్ కుమార్ వైద్య సిబ్బంది తదితరులు పాల్గోన్నారు.
Spread the love