బతుకమ్మ సంబురాల్లో అపశృతి..

నవతెలంగాణ  – హైదరాబాద్: బతుకమ్మ వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. ఆర్మీ జవాన్‌పై ఓ వ్యక్తి కత్తితో దాడి చేయగా అతనికి తీవ్రగాయాలయ్యాయి‌. వికారాబాద్ జిల్లా ధరూర్ మండలం రేవులపల్లి గ్రామంలో సోమవారం రాత్రి బతుకమ్మ సంబరాల నేపథ్యంలో ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ క్రమంలోనే కృష్ణ అనే వ్యక్తి మైక్ సౌండ్ బంద్ చేయాలని నిర్వాహకులతో వాగ్వివాదానికి దిగాడు. అక్కడ ఉన్నవారు ఆట పూర్తయ్యాక పాటలు బంద్ చేస్తామని చెప్పినా వినలేదు. సౌండ్ ఆపుతారా? లేదా అని వాగ్వాదానికి దిగడంతో పాటు కృష్ణ స్థానికులపై దాడి చేశాడు. గొడవ పెద్దది కావడంతో అదే కాలనీలో ఉంటున్న ఆర్మీ జవాన్ మణివర్దన్ ఇరువర్గాలను శాంతింపజేయడానికి యత్నించాడు. అయితే, సహనం కోల్పోయిన కృష్ణ ఆర్మీ జవాన్‌పై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో జవాన్ తీవ్రంగా గాయపడగా, చికిత్స కోసం గద్వాల ఆసుపత్రికి తరలించారు. ఫస్ట్ ఎయిడ్ తర్వాత జవాన్‌ను మెరుగైన వైద్యం కోసం మహబూబ్ నగర్‌కు తరలించారు.కృష్ణ అనే యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు.

Spread the love