రూ.లక్ష ఆర్థిక సాయానికి దరఖాస్తు గడువు పెంచాలి

నవతెలంగాణ -నాగోల్‌
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన లక్ష రూపాయల ఆర్థిక సహాయానికి దరఖాస్తుల సమయాన్ని ఈ నెల 30 వరకు పొడగించాలని తెలంగాణ రాష్ట్ర చేతి వత్తుల సంఘాల రాష్ట్ర సబ్‌ కమిటీ సభ్యులు బోడ్డుపల్లి కష్ణ ప్రభుత్వాన్ని కోరారు. బీసీ చేతి వత్తిదారులకు లక్ష రూపాయల ప్రభుత్వ సహాయం కోసం ఆన్లైన్‌ లో దరఖాస్తు చేసుకునేందుకు వెళ్తే కంప్యూటర్‌ సర్వర్‌లు మొరాయించి పని చేయడంలేదని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి ఉందన్నారు. చాలా మంది అర్హులు దరఖాస్తు చేసుకోలేదని.. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ ఆర్థిక సహాయానికి గడువు పెంచాలని కోరారు. దళితులకు రూ.10 లక్షలు ఇచ్చి.. జనాభాలో 50 శాతం ఉన్న బీసీ లకు రూ.లక్ష సాయం అది కూడా కొద్దిమంది బీసీ చేతి వత్తిదారులకు వర్తింపజేయడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో పూట గడవని నిస్సహాయ స్థితిలోని ఉన్న నిరుపేద, వెనుకబడిన వర్గాల కుల వత్తిదారులు పెట్టుబడులు పెట్టుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ లక్ష రూపాయల ప్రభుత్వ సహాయం ఏమాత్రం సరిపోదన్నారు. 52 శాతం ఉన్న బీసీ చేతి వత్తిదారులందరికీ ‘బీసీ బంధు ‘ ప్రవేశపెట్టి..రూ. 10 లక్షలు సహాయం చేయాలనీ బొడ్డుపల్లి కష్ణ సీఎం కేసీఆర్‌ను కోరారు.

Spread the love