మోడల్ స్కూల్ లో ప్రవేశాలకు దరఖాస్తు…

నవతెలంగాణ- వలిగొండ రూరల్
మండల పరిధిలోని లోతుకుంట మోడల్ స్కూల్ 2024 -25 విద్యాసంవత్సరానికి ఆరవ తరగతి ప్రవేశానికి, ఏడవ తరగతి నుండి పదవ తరగతి వరకు ఉన్న ఖాళీలను ఆన్లైన్ ద్వారా భర్తీ చేయనున్నట్లు పాఠశాల ప్రిన్సిపల్ గోరంట్ల రాము శనివారం ప్రకటనలో తెలియజేశారు. విద్యార్థులు ఈనెల 22 వరకు ఆన్లైన్లో లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, విద్యార్థులకు 150 రూపాయల ఫీజుతో, ఓసి విద్యార్థులకు 200 రూపాయల రుసుము ఉంటుందని తెలియజేశారు. విద్యార్థులు ఆధార్ కాపీ, పాస్ ఫోటోతో దరఖాస్తు చేసుకొని ఆన్లైన్ ప్రింట్ కాపీని పాఠశాల కార్యాలయంలో అందజేయాలని తెలియజేశారు.
Spread the love