బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్‌లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

నవతెలంగాణ-సిటీబ్యూరో
2024-25 విద్యా సంవత్సరానికి గిరిజన బాల/బాలికలకు బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్‌లో ప్రవేశాలకు గాను 46 సీట్లను జిల్లకు మంజూరు చేసినట్టు మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా గిరిజన అభివృద్ధి శాఖ అధికారి వినోద్‌కుమార్‌ తెలిపారు. 3వ తరగతిలో 22 సీట్లు, 5వ తరగతిలో 12 సీట్లు, 8వ తరగతిలో 12 సీట్లు కేటాయించినట్టు తెలిపారు. గిరిజన తెగలకు చెందిన లంబాడా, ఎరుకుల, ఇతర ఉప-కులాలకు చెందిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. దరఖాస్తు చేసుకోవడానికి జూన్‌ 6వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అవకాశం ఉందని తెలిపారు. దరఖాస్తు ఫారాలను కలెక్టరేట్‌లోని జిల్లా గిరిజన అభివద్ధి అధికారి కార్యాలయంలో అందజేయాలని తెలిపారు. నేటి నుంచి దరఖాస్తులను ఉచితంగా పొందవచ్చు అనీ, దరఖాస్తుతో పాటు కావాల్సిన ధ్రువీకరణ పత్రాలు కులం, ఆదాయం, ఆధార్‌ కార్డు, రేషన్‌ కార్డు, ప్రస్తుతం చదువుతున్న పాఠశాల నుంచి పొందిన బోనఫైడ్‌ సర్టిఫికెట్‌, 2 పాస్‌పోర్ట్‌ సైజు ఫోటోలు (లేటెస్ట్‌)తో సమర్పించాలని తెలిపారు. అర్హులైన గిరిజన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. చివరి తేదీ జూన్‌ 6 తర్వాత దరఖాస్తులను తీసుకోమ నీ, మరిన్ని వివరాలకు 9959159629 నెంబర్‌ను సంప్రదించాలని కోరారు.
జిల్లా షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో..
2024-25 సంవత్సరంలో బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్‌ (డే స్కాలర్‌) పాఠశాలలో 1వ తరగతిలో ప్రవేశం కోసం 5-6 ఏండ్ల లోపు గల షెడ్యూల్డ్‌ కులాల బాల బాలికల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి శాఖ అధికారి కేషురాం తెలిపారు.
వీరు అర్హులు..
1.అభ్యర్థులు మేడ్చల్‌ నెటివిటీ సర్టిఫికెట్‌ మీ-సేవా ఉండాలనీ, మల్కాజిగిరి జిల్లాకు చెందిన వారై ఉండాలని తెలిపారు. 2.అభ్యర్థి తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.లక్షన్నర లోపు గ్రామీణ ప్రాంతాల వారికి, రూ.2లక్షల లోపు పట్టన ప్రాంతాల వారికి ఉండాలి. 3.ఒక్క కుటుంబం నుంచి ఒక్క విద్యార్థికి మాత్రమే బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్‌ పథకం కింద అవకాశం ఉంటుంది. 4.విద్యార్థి వయస్సు 01-06-2024 నాటికి 5-6 ఏండ్లు కలిగి ఉండాలి. 5.కులం, ఆదాయ ధ్రువపత్రాలు మీ-సేవా ద్వారా పొంది ఉండాలి. 6.బాల బాలికలు పాఠశాలలలో ప్రవేశానికి దరఖాస్తు ఫారాలు తేదీ ఈ నెల 18 నుంచి జూన్‌ 7వ తేదీ వరకు కలెక్టరేట్‌లోని జిల్లా షెడ్యూల్డ్‌ కులాల అభివద్ధి అధికారి కార్యాలయంలో లభిస్తాయి. 7.ఈ కింద కనబరిచిన, ఎన్నిక కాబడిన పాఠశాలల ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకోవాలి.
స్కూల్స్‌ ఇలా..
1.ఆర్‌ఎస్‌కె ఉన్నత పాఠశాల, చింతల్‌ 2.బ్రిల్లియంట్‌ గ్రామర్‌ ఉన్నత పాఠశాల, కుషాయిగూడ 3.బ్రిల్లియంట్‌ గ్రామర్‌ ఉన్నత పాఠశాల, కూకట్‌పల్లి 4.పద్మశ్రీ ఉన్నత పాఠశాల, బోడుప్పల్‌
పూర్తి చేసిన దరఖాస్తు ఫారాలను కలెక్టరేట్‌లోని జిల్లా షెడ్యూల్డ్‌ కులాల అభివద్ధి అధికారి కార్యాలయంలో జూన్‌ 7వ తేదీ సాయంత్రం 3 గంటల లోపు అందజేయాలి. త తర్వాత వచ్చిన దరఖాస్తులను పరిగణలోకి తీసుకోరు. జూన్‌ 11వ తేదీన సాయంత్రం 3 గంటలకు విద్యార్థుల ఎంపిక కోసం డ్రా తీస్తారని కేషురాం తెలిపారు.

Spread the love