నవతెలంగాణ – అశ్వారావుపేట
అశ్వారావుపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో గల టి.ఎం.ఆర్.ఇ.ఐ (తెలంగాణ అల్ప సంఖ్యాక గురుకుల విద్యా సంస్థ) బాలికల పాఠశాల నందు ఖాళీగా గల టీచింగ్ పోస్టులకు (ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన) టీజీటి ఉర్దూ -1,పీ.జీ.టి ఆంగ్లం – 2 పోస్టులను భర్తీ చేయుటకు అర్హత కల్గిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ టి.సంగీత ప్రకటన ద్వారా శుక్రవారం తెలిపారు. అర్హులైన అభ్యర్థులు 29/05/2023 నుండి 04/06/2023 లోపు బయోడేటా తో పాటు సంబంధిత అర్హత సర్టిపికెట్లు పాఠశాల నందు సమర్పించ వలసినదిగా తెలిపారు. టీజీటి ఉర్దూ పోస్టు నకు డిగ్రీ బీ.ఈ.డి (సంబంధిత విభాగం ఉర్దూ మెథాడాలజీ) పీ.జీ.టి ఆంగ్లం పోస్టు నకు పీజీ బీఈడీ (ఆంగ్లం మెథడాలజీ) తో 2 నుండి 5 సంవత్సరాలు బోధనా అనుభవం కలిగిన మహిళా అభ్యర్థులు అర్హులు అని తెలిపారు. వివరాలకు సంప్రదించాల్సిన నెంబర్ లు 7995057877, 739604 5415.