రాజీవ్‌ గాంధీ యూత్‌ ఆన్‌లైన్‌ క్విజ్‌ పోటీలకు దరఖాస్తులు

నవతెలంగాణ- ఘట్కేసర్‌
రాజీవ్‌ గాంధీ యూత్‌ ఆన్‌ లైన్‌ క్విజ్‌ పోటీలకు మేడ్చల్‌ జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని యువతీ యువకులు, విద్యార్థులు దరఖాస్తు చేసు కోవాలని ఎన్‌ఎస్‌యూఐ మేడ్చ ల్‌ జిల్లా అధ్యక్షుడు మామిండ్ల రాహుల్‌ యాదవ్‌ సూచించారు. ఎన్‌ఎస్‌యూఐ మండల అధ్యక్షుడు శివాజీ నాయక్‌ ఆధ్వ ర్యంలో గురువారం నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సంచలనాత్మక హైద రాబాద్‌ యూత్‌ డిక్లరేషన్‌ స్ఫూర్తిగా తెలంగాణ యువశక్తిని మేల్కొల్పే దిశగా జూన్‌ 18న నిర్వహించే రాజీవ్‌ గాంధీ యూత్‌ ఆన్‌ లైన్‌ క్విజ్‌ పోటీలను నిర్వహించనున్నట్లు వివరించారు. పోటీలో పాల్గొనాలనుకునే అభ్యర్థులు ముందుగా 7661899899 నెంబర్‌ కు మిస్డ్‌ కాల్‌ ఇచ్చిన వెంటనే రిజిస్ట్రేషన్‌ వెబ్‌ లింక్‌తో కూడిన ఒక ఎస్‌ఎంఎస్‌ను పొందుతారని, ఆ లింకు ద్వారా వారి వివరాలను అందులో జూన్‌ 17వ తేదీలోగా నమోదు చేసుకోవాలని సూచించారు.
ప్రథమ బహుమతి కింద ల్యాప్‌ టాప్‌, ద్వితీయ బహుమతి స్మార్ట్‌ ఫోన్‌, తతీయ బహుమతి టాబ్లెట్‌తోపాటు ప్రతి నియోజకవర్గంలో 40 ప్రోత్సాహక బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు. ప్రోత్సాహక బహుమతులలో 10 స్మార్ట్‌ వాచ్‌లు, 10 హార్డ్‌ డ్రైవ్‌లు, 10 ఇయర్‌ బర్డ్స్‌, 10 పవర్‌ బ్యాంకులను, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోని మహిళా టాపర్లకు ప్రత్యేక బహుమతుల కింద ఎలక్ట్రిక్‌ స్కూటర్లను కూడా బహూకరిస్తున్నట్లు చెప్పారు. ఈ బహుమతులను కాంగ్రెస్‌ జాతీయ చైర్‌ పర్సన్‌ సోనియా గాంధీ చేతుల మీదుగా హైదరాబాదులో ప్రదానం చేయనున్నట్లు తెలియజేశారు. ఈ పోటీల్లో 60 నిమిషాల్లో 60 ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుందని..భారతదేశ భౌగోళిక చరిత్ర, సంస్కతి, తెలంగాణ సంస్కతి, చరిత్ర, సామాజిక ఉద్యమాలపై ప్రశ్నలు ఉంటాయని ఆయన వివరించారు. క్విజ్‌ కాంపిటీషన్‌కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే 8142903456, 8142803456 నెంబర్లకు ఫోన్‌ చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాకేష్‌, శ్రీధర్‌, సాయి చరణ్‌ , రామ్‌ పాల్గొన్నారు.

Spread the love