నవతెలంగాణ-బెజ్జంకి
మండల పరిధిలోని గుండారం గ్రామానికి చెందిన బోడపట్ల తిరుపతి బీఆర్ఎస్ జిల్లా ఉపాధ్యక్షుడిగా నియమాకమైనట్టు మండలాధ్యక్షుడు మహిపాల్ రెడ్డి శనివారం తెలిపారు. ఈ మేరకు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తిరుపతికి నియమాకపత్రమందజేశారు. తన నియమాకానికి సహకరించిన, జిల్లా మండల బీఆర్ఎస్ నాయకులకు తిరుపతి కృతజ్ఞతలు తెలిపారు.