నియోజకవర్గ కోఆర్డినేటర్ ల నియామకం..

– భద్రాచలానికి జ్యేష్ట, అశ్వారావుపేట కు తుల్లూరులు
నవతెలంగాణ – అశ్వారావుపేట
పార్లమెంట్ ఎన్నికల నేపధ్యంలో ఖమ్మం పార్లమెంట్ పరిధిలోని నియోజక వర్గాలకు కోఆర్డినేటర్ లను తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నియమించింది. వీరు ఎన్నికల ప్రచారం, విజయావకాశాలను మెరుగుపరచడానికి నియోజక వర్గంలోని మండలాల నాయకులను, కార్యకర్తలను సమన్వయం చేస్తూ పనిచేయాల్సి ఉంటుంది. ఈ నేపధ్యంలో అశ్వారావుపేట అసెంబ్లీ నియోజక వర్గం ఎన్నికల కోఆర్డినేటర్ గా అశ్వాపురం మండలానికి చెందిన తాల్లూరి బ్రహ్మయ్య,  అశ్వారావుపేట కు చెందిన కాంగ్రెస్ నాయకులు జ్యేష్ట సత్యనారాయణ చౌదరి ని భద్రాచలం అసెంబ్లీ నియోజక వర్గానికి అధిష్టానం నియమించింది.
Spread the love