నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
వరంగల్-నల్లగొండ-ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికల కోసం శాసనసభా నియోజకవర్గాల వారీగా ఇన్‌చార్జీలను బీఆర్‌ఎస్ నియమించింది. ఈ మేరకు ఆదివారం ఆ పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది. మూడు ఉమ్మడి జిల్లాల్లోని శాసనసభా నియోజకవర్గాల వారీగా ఇన్‌ఛార్జీలను పేర్లను వెల్లడించింది. సూర్యాపేట, హుజూర్ నగర్ నియోజకవర్గాలకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి, పాలకుర్తి, వర్థన్నపేట (ఎస్సీ) నియోజకవర్గాలకు ఎర్రబెల్లి దయాకర్‌రావుతో పాటు ఇతర నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జీలను ప్రకటించారు.