నవతెలంగాణ-గోదావరిఖని: సింగరేణి భవన్ లో ఫైనాన్స్, మార్కెటింగ్, పర్చేజ్ డిపా ర్ట్మెంట్‌లలో పని చేయడానికి నలుగురు హైస్కిల్డ్ అభ్యర్థులు రెండు సంవ త్సరాల కోసం కావాలని నిట్ (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) ద్వారా కోరిందని, దీని కోసం పదిహేడు మంది కాంట్రాక్టరులు టెండర్ వేశారని, డ్రా పద్ధతిన ఇట్టి నియామకం జరుగుతుందని, ఈ నియామకాలను సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని ఆ యూనియన్ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లా గౌడ్, కేంద్ర కార్యదర్శి కే.స్వామి లు పేర్కొన్నారు. మంగళవారం గోదావరిఖని భాస్కర్ రావు భవన్‌లో జరిగిన ఏఐటీయూసీ కార్యకర్తల సమావేశంలో వారు పాల్గొని మాట్లాడుతూ సింగరేణి భవన్ లో మూడు ముఖ్యమైన విభాగాల్లో తాత్కాలిక పద్దతిన ఉద్యోగాలు కల్పించడం కార్మిక వ్యతిరేక చర్య గా బావిస్తూ, యాజమాన్యం తీరును ఖండిస్తున్నామని వారు తెలిపారు. ఈ సమావేశంలో సీపీఐ, ఏఐటీయూసీ నాయకులు గౌతం గోవర్దన్, కే.కనకరాజు, తాళ్లపెల్లి మల్లయ్య, మద్దెల దినెష్, బోయిన స్వామి, మానాల శ్రీనివాస్, పెరుమాళ్ళ రమేష్‌గౌడ్, ఎం.దేవేందర్‌రెడ్డి, ఎం.సూర్య, జే.వినరు, ఎర్రగొల్ల చేరాలు, పడాల కనకరాజు, బూడిద మల్లేశ్, మోరే సమ్మయ్య, తొగరు మల్లయ్యతో పాటు ఆఫీసు కార్యదర్శి తొడుపునూరి రమేష్ కుమార్ పాల్గొన్నారు.