– పర్యాటక అభివృద్ధి సంస్థ ఛైర్మెన్‌గా పటేల్ రమేశ్‌రెడ్డి
– అటవీ అభివృద్ధి సంస్థ ఛైర్మెన్‌గా పొదెం వీరయ్య
– టీజీఐఐసీ ఛైర్‌పర్సన్‌గా నిర్మలాజగ్గారెడ్డి
– ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
నామినేటెడ్ పదవుల భర్తీపై గత మూడు నెలలుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. పలు కార్పొరేషన్లకు ఛైర్మెన్లను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు సంబంధించి మార్చి 15నే జీవో విడుదలైంది. ఆ వెంటనే పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఛైర్మెన్లు బాధ్యతలు చేపట్టలేదు. ఎన్నికల దృష్ట్యా ఆగిన నియామకపు ఉత్తర్వులను ప్రభుత్వం తాజాగా సోమవారం విడుదల చేసింది. తమకు కూడా నామినేటెడ్ పదవులు ఇవ్వాలని పలువురు కాంగ్రెస్ నేతలు ఎన్నికల అనంతరం పట్టుబట్టారు. కార్పొరేషన్ చైర్మెన్లలో కొందరిని మార్చాలంటూ సీనియర్లు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో 60కి పైగా కార్పొరేషన్లు ఉన్నప్పటికీ మొదటి దశలో 35 సంస్థల ఛైర్మెన్లను మాత్రమే నియమించామనీ, మిగతా వాటికి నియమించేటప్పుడు అందరికి న్యాయం చేస్తామని అధినాయకత్వం వారిని బుజ్జగించింది. మొదటి నుంచి పార్టీ గెలుపు కోసం పనిచేసిన వారందరికీ అవకాశ కల్పిస్తామని హామీ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది. ఈ నేపథ్యంలో తీవ్ర తర్జన భర్జనల అనంతరం ఎట్టకేలకు సోమవారం ప్రభుత్వం జీవోను బహిరంగపరిచింది. కాగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి రెండు సంవత్సరాలు వీరు పదవిలో కొనసాగనున్నారు. రెండ్రోజుల్లో కొత్త ఛైర్మెన్లందరూ బాధ్యతలు స్వీకరించనున్నారని చేరనున్నట్టు సమాచారం.
పార్టీ విధేయులకు ప్రాధాన్యత
నామినేటెడ్ పదవుల భర్తీలో పార్టీ విధేయులకు అధిష్టానం ప్రాధాన్యత ఇచ్చింది. పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో, సామాజిక సమీకరణాల దృష్ట్యా సీట్లు రానివారికి, పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పాటు పడిన వారికి పదవులను కట్టబెట్టింది. కాంగ్రెస్ సీనియర్ లీడరైన పోదెం వీరయ్య భద్రాచలంనుంచి పోటీ చేసి ఓడి పోయారు. బీఆర్‌ఎస్ హయాంలో అనేక ప్రలోభాలకు గురి చేసినా పార్టీని వీడలేదు. అయనకు అటవీ అభివృద్ధి సంస్థ చైర్మెన్‌గా అవకాశం దక్కింది.నల్లగొండ ఎంపీ, సూర్యపేట ఎమ్మెల్యే టికెట్లు ఆశించి భంగపడ్డ పటేల్ రమేశ్‌రెడ్డిని పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మెన్ పదవి వరించింది. పదేండ్ల పాటు ఎలాంటి పదవులు లేకున్నా పార్టీని వీడకుండా ఉన్న పలువురు సీనియర్లకు చైర్మెన్లుగా అవకాశం దక్కింది.
కార్పొరేషన్ ఛైర్మెన్ల వివరాలు
క్ర.సంఖ్య కార్పొరేషన్ చైర్మెన్
1). పర్యాటక అభివృద్ధి సంస్థ పటేల్ రమేశ్‌రెడ్డి
2). అటవీ అభివృద్ధి సంస్థ పొదెం వీరయ్య
3). పారిశ్రామిక అభివృద్ధి సంస్థ నిర్మలాజగ్గారెడ్డి
4). రాష్ట్ర సహకార సంఘం మానాల మోహన్‌రెడ్డి
5). రాష్ట్ర గిడ్డంగులు సంస్థ రాయల నాగేశ్వరరావు
6). ముదిరాజ్ కార్పొరేషన్ జ్ఞానేశ్వర్ ముదిరాజ్
7). మత్స్యసహకార సమాఖ్య మెట్టు సాయికుమార్
8). రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ ఎండీ. రియాజ్
9). ఎస్టీ కార్పొరేషన్ బెల్లయ్య నాయక్
10). ఆర్యవైశ్య కార్పొరేషన్ కాల్వ సుజాత
11). పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ ఆర్. గురునాథ్‌రెడ్డి
12). సెట్ విన్ ఛైర్మెన్ ఎన్. గిరిధర్‌రెడ్డి
13). ఎంబీసీ కార్పొరేషన్ జె. జైపాల్
14). కనీస వేతనాల సలహా బోర్డు జనక్ ప్రసాద్
15). నీటిపారుదల అభివృద్ధి సంస్థ ఎం.విజయ్‌బాబు
16). హస్త కళల అభివృద్ధి ఛైర్మన్‌గా నాయుడు సత్యనారాయణ
17). విత్తనాభివృద్ధి సంస్థ ఎస్. అన్వేష్‌రెడ్డి
18). ఆగ్రో పరిశ్రమల అభివృద్ధి సంస్థ కాసుల బాలరాజు
19). ఆయిల్ సీడ్స్ అభివృద్ధి సంస్థ జంగా రాఘవరెడ్డి
20). ఖనిజాభివృద్ధి సంస్థ అనిల్ ఎర్రవాత్
21). వాణిజ్య ప్రోత్సాహక కార్పొరేషన్ అయిత ప్రకాశ్‌రెడ్డి
22). సాంకేతిక సేవల అభివృద్ధి సంస్థ మన్నె సతీష్‌కుమార్
23). పట్టణ ఆర్థిక అభివృద్ధి సంస్థ చల్లా నర్సింహారెడ్డి
24). శాతవాహన పట్టాణాభివృద్ధి సంస్థ కె.నరేందర్‌రెడ్డి
25). కాకతీయ పట్టాణాభివృద్ధి సంస్థ ఈ.వెంకటరామిరెడ్డి
26). రహదారి అభివృద్ధి సంస్థ మల్‌రెడ్డి రామిరెడ్డి
27). తెలంగాణ ఫుడ్స్ ఎం.ఎ.ఫహిమ్
28). మహిళా సహకార అభివృద్ధి సంసథ బి. శోభారాణి
29). వికలాంగుల కార్పొరేషన్ ఎం.వీరయ్య
30). తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ కె. శివసేనారెడ్డి
31). సంగీత నాట్య అకాడమీ అలేక్య పుంజాల
32). ఎస్సీ కార్పొరేషన్ ఎన్.ప్రీతం
33). బీసీ కార్పొరేషన్ నూతి శ్రీకాంత్
34). గిరిజన కార్పొరేషన్ కె.తిరుపతి
35). మైనార్టీ కార్పొరేషన్ వైస్ చైర్మెన్ ఎంఏ. జబ్బార్