– సారంగాపూర్ చైర్మన్ గా అబ్దుల్ హాది..
– నిర్మల్ చైర్మన్ గా సోమ భీమ్ రెడ్డి..
– డీసీసీ అద్యక్షులు శ్రీహరి రావు ముఖ్య అనుచరులకు అవకాశమిచ్చిన రాష్ట్ర కాంగ్రెస్..
నవతెలంగాణ – సారంగాపూర్
నిర్మల్ జిల్లాలోని కీలకమైన సారంగాపూర్,నిర్మల్ వ్యవసాయ మార్కెట్ కమిటీలకు పాలకవర్గాలను ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవోలు జారీ చేసింది. నిర్మల్ జిల్లా కాంగ్రెస్ నేత శ్రీహరి రావు కు అత్యంత సన్నిహితులు ఇద్దరు నేతలకు రాష్ట్ర కాంగ్రెస్ పెద్దపీట వేసింది. వర్గ రాజకీయాలకు తావు లేకుండా డీసీసీ అధ్యక్షుడు శ్రీహరి రావు సూచన మేరకు రెండు మార్కెట్ కమిటీలకు పాలకవర్గాలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. నిర్మల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా సోమ భీమ్ రెడ్డి, సారంగాపూర్ చైర్మన్ అబ్దుల్ హాదిలు నియామకమయ్యారు. ఈ ఇద్దరు మార్కెట్ చైర్మన్ల ఖరారుతో జిల్లా రాజకీయాల్లో శ్రీహరి రావు తనను నమ్ముకున్న వారికి పెద్దపీట వేశారన్న పేరు పొందారు.

రాష్ట్ర మార్కెటింగ్ శాఖ జీ.ఓ జారీ: సారంగాపూర్ మార్కెట్ కమిటీ పాలక వర్గం
చైర్మన్ గా అబ్దుల్ హాదీ, వైస్ చైర్మన్ గా ఎల్ శంకర్ రెడ్డి, సుభాష్ రెడ్డి, సాద ప్రశాంత్, రాథోడ్ పుష్ప, కొత్త కాపు పోతారెడ్డి, నేరడి గొండ శ్రీనివాస్, తాటి మహిపాల్, శీల సాయినాథ్, అహ్మద్ ముక్తార్, ఆత్రం నాగోరావు, ట్రేడర్స్ నుంచి పడిగెల కేదార్ నాథ్ లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. తాజా నియామకాలతో కాంగ్రెస్ వర్గాల్లో హర్షం వ్యక్తం అవుతోంది.