ఎల్.వి ప్రొడక్షన్ బ్యానర్లో లక్షిన్ దర్శకత్వం వహించిన షార్ట్ ఫిలిం ‘ధ్వని’. డెఫ్ అండ్ డంప్ కాన్సెప్ట్‌తో ఈ షార్ట్ ఫిల్మ్‌ను నీలిమ వేముల నిర్మించారు. అశ్విన్ కురమన సంగీతం అందించారు. ఈ షార్ట్ ఫిల్మ్ రిలీజ్ నిర్మాత బెల్లంకొండ సురేష్ చేతుల మీదుగా జరిగింది. ఈ వేడుకలో లక్షిన్కు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డ్‌ని అందజేశారు. పది ఏళ్ల లక్షిన్ ఇరవై ఏళ్లలోపు ఇరవై ఫిలిమ్స్ చేయాలనే లక్ష్యంతో ఉన్నారు. ‘నేను ఈ షార్ట్ ఫిల్మ్ చేయటానికి ఎంకరేజ్ చేసిన పేరెంట్స్‌కు థ్యాంక్స్. చిన్న కాన్సెప్ట్‌తో తీసిన ఈ దీనికి అందరి నుండి మంచి రెస్పాన్స్ లభిస్తోంది’ అని అన్నారు. ‘ధ్వని అనే డిఫరెంట్ కాన్సెప్ట్‌తో పదకొండు నిమిషాల్లో ఈ షార్ట్ ఫిల్మ్‌ని లక్షిన్ చాలా బాగా తీశాడు’
అని నిర్మాత నీలిమ వేముల చెప్పారు.