అక్రమంగా రవాణా చేస్తున్న పశువుల పట్టివేత

నవతెలంగాణ-తాడ్వాయి
ములుగు  జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని మేడారం ఆర్చ్ గేట్ వద్ద కభేళాకు అక్రమంగా తరలిస్తున్న 46 ఆవులను, 31ఎద్దులు, 17 చిన్న లేగలు మొత్తం 94 పశువులు గల ఏపీ 13X7700 నెంబర్ గల వేగంగా వెళ్తున్న వాహనాన్ని తాడ్వాయి పోలీసులు వెంబడించి పెట్టుకొని వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రతి వాహనం నడుపుతున్న మహబూబ్నగర్ జిల్లాకు చెందిన డ్రైవర్ గడ్డిపావలా అర్జున్, హైదరాబాద్ కు చెందిన డ్రైవర్ ఎండి అంజద్ ఖురేషీ లను తీసుకొని వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ కంటైనర్ లో ఉన్న పశువులను పోషనార్థం గోకులం గోశాల రాంపూర్ మేడారం రోడ్డు భూపాల్ పల్లికి పంపించారు.
Spread the love