ఏపీ పీఆర్‌సీ ఛైర్మన్‌ మన్మోహన్‌సింగ్‌ రాజీనామా

నవతెలంగాణ-హైదరాబాద్ : ఉద్యోగుల వేతన సవరణకు నియమించిన 12వ పీఆర్సీ ఛైర్మన్‌, విశ్రాంత ఐఏఎస్‌ అధికారి మన్మోహన్‌సింగ్‌ తన పదవికి రాజీనామా చేశారు. ఉద్యోగులను కేటాయించకపోవడంతో ఆ పదవి నుంచి తప్పించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌కి మంగళవారం లేఖ రాశారు. 2023 జులైలో తనను నియమించినప్పటికీ కమిషన్‌కు ఉద్యోగులు లేకపోవడంతో పని ప్రారంభించలేకపోయానని లేఖలో పేర్కొన్నారు. దీంతో పాటు మరికొన్ని వ్యక్తిగత కారణాల రీత్యా ఛైర్మన్‌ పదవి నుంచి తనను రిలీవ్‌ చేయాలని మన్మోహన్‌సింగ్‌ కోరారు.

Spread the love