పంటి సమస్యలు మనల్ని తరచూ వేధిస్తాయి. దీంతో అనేక ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. అయితే, సమస్య వచ్చిన తర్వాత కంటే ముందస్తు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల పళ్లు, చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. అవి ఏంటో తెలుసుకుందాం.
పండ్లు, కూరగాయల్లో విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి పంటిని చిగుళ్ళని బలంగా ఉంచుతాయి.
ఫ్యాటీ ఫిష్‌లో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి చిగుళ్ళు వ్యాధుల బారిన పడకుండా కాపాడుతాయి. ఇవి పంటి ఆరోగ్యానికి ఎంతో లాభదాయకం.
రోజంతటికీ కావలసిన నీటిని తీసుకోవటం వల్ల పళ్ళు కూడా హైడ్రేటెడ్‌గా ఉంటాయి. పంటిలో పేరుకున్న ఆహార పదార్థాలు, బ్యాక్టిరియాను తొలగిస్తుంది.
ముఖ్యంగా పాల ఉత్పత్తుల్లో కూడా పంటిని బలంగా మార్చే గుణం ఉంటుంది.
పాలు, పెరుగు, చీజ్ వంటివి కాల్షియం ఫాస్ఫరస్ కలిగి ఉంటాయి .కాబట్టి అవి ఆరోగ్యకరమైన పళ్లకు ఎంతో ముఖ్యం. ఈ ప్రాబయోటిక్స్ బ్యాక్టీరియాని తొలగించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.