హుస్నాబాద్ లో అర్ఏఏఫ్  ఫ్లాగ్ మార్చ్

నవతెలంగాణ -హుస్నాబాద్ రూరల్
హుస్నాబాద్ పట్టణంలో  రాపిడ్ యాక్షన్ ఫోర్స్ సోమవారం  ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ సతీష్ మాట్లాడుతూ పోలీస్ కమిషనర్ ఆదేశానుసారం  భౌగోళిక పరిస్థితులను తెలుసుకోవడం కోసం బ్లాక్ మార్చ్ నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలో ఏదైనా శాంతిభద్రతల సమస్య, మతఘర్షణలు జరిగినప్పుడు జిల్లా పోలీసులకు సహాయ సహకారాలు అందించి బందోబస్తు నిర్వహిస్తారన్నారు. ప్రజలకు సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ  మేమున్నామనే భరోసా కల్పించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాపిడ్ యాక్షన్ ఫోర్స్ డిప్యూటీ కమాండెంట్ నరేష్ కుమార్, హుస్నాబాద్ సీఐ కిరణ్, ఎస్ఐ మహేష్, అక్కన్నపేట ఎస్ఐ వివేక్, కోహెడ ఎస్ఐ తిరుపతి, ఆర్ ఏ ఎఫ్  ఇన్స్పెక్టర్లు డీఎస్ మస్కర్, వి. ఏ. రావు, రాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బంది తదితరులు  పాల్గొన్నారు.
Spread the love