మస్త్‌ షేడ్స్‌ ఉన్నారురా.. రిలీజ్‌కి రెడీ

మస్త్‌ షేడ్స్‌ ఉన్నారురా.. రిలీజ్‌కి రెడీ”ఈ నగరానికి ఏమైంది, మీకు మాత్రమే చెబుతా, సేవ్‌ టైగర్‌’ చిత్రాల్లో కమెడియన్‌గా పాపులారిటీ సంపాందించుకుని, తనకంటూ ఓ మార్క్‌ను క్రియేట్‌ చేసుకున్న నటుడు అభినవ్‌ గోమఠం. తాజాగా ‘మస్తు షేడ్స్‌ ఉన్నారు రా’ చిత్రంతో అభినవ్‌ హీరోగా పరిచయం అవుతున్నారు. వైశాలి రాజ్‌ హీరోయిన్‌. కాసుల క్రియేటివ్‌ వర్క్స్‌ పతాకపంపై తిరుపతి రావు ఇండ్ల దర్శకత్వంలో భవాని కాసుల, ఆరెమ్‌ రెడ్డి, ప్రశాంత్‌.వి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈనెల 23న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా శనివారం ఈ చిత్ర ట్రైలర్‌ను హీరో నిఖిల్‌ విడుదల చేశారు. హీరో నిఖిల్‌ మాట్లాడుతూ, ‘ఈ సినిమా చూసిన తరువాత అందరూ అభినవ్‌ లాంటి ఫ్రెండ్‌ కావాలని అనుకుంటారు. సెట్‌లో అందర్ని నవ్విస్తుంటారు. ఆయనలో చాలా షేడ్స్‌ ఉన్నాయి. విడుదలకు ముందే ఈ సినిమాను కొంత మందికి చూపించారు. వాళ్లు చాలా పాజిటివ్‌గా స్పందించారని తెలిసింది. వాళ్ల రివ్యూ తెలుసుకుని ఈ ఈవెంట్‌కు వచ్చాను. తప్పకుండా చిత్రం ప్రేక్షకుల నుంచి కూడా మంచి స్పందన వస్తుందని అనుకుంటున్నాను. మీరందరూ సినిమా చూస్తే నేను ఈ సినిమా ఈవెంట్‌కు ఎందుకు వచ్చానో తెలుస్తుంది. అభినవ్‌ గోమఠంకు ఈ చిత్రం హీరోగా మంచి బిగినింగ్‌ను అందించాలని, సినిమా పెద్ద హిట్‌ అవ్వాలని ఆశిస్తున్నాను అన్నారు. ‘ఇలాంటి వేడుకలకు చాలా సార్లు వచ్చాను. కానీ ఇప్పుడు ఇది నా వేడుక కాస్త ఒత్తిడిగా ఉంది. ఇది నా లైఫ్‌లో స్పెషల్‌ మూమెంట్‌. దర్శకుడు తిరుపతి రావు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్‌. ఈ సినిమాలో పాత్రలు అన్ని ఎంతో సహజంగా ఉంటాయి. నాకు హీరోగా చాలా ఆఫర్లు వచ్చాయి. కానీ నాకు తగ్గ కథ కోసం ఎదురుచూసి ఈ సినిమాను ఎంచుకున్నాను. తప్పకుండా ఈ చిత్రం తప్పకుండా అందరికి నచ్చుతుందనే నమ్మకం ఉంది’ అని అభినవ్‌ గోమఠం చెప్పారు. దర్శకుడు తిరుపతి రావు మాట్లాడుతూ, ‘నేను ఈ రోజు దర్శకుడుగా మీ ముందుకు రావడానికి ప్రధాన కారణం నిర్మాత కాసుల భవానీ, చిన్న సినిమాను కంటెంట్‌ బాగుంటే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. ఆ కోవలోనే ఈ చిత్రాన్ని కూడా ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్ముతున్నాను. నిఖిల్‌ నటించిన సూర్య వర్సస్‌ సూర్య చిత్రానికి నేను సెట్‌ అసిస్టెంట్‌గా పనిచేశాను. ఈ రోజు నా దర్శకత్వంలో రాబోతున్న సినిమాకు నిఖిల్‌ అతిథిగా రావడం ఆనందంగా ఉంది’ అని అన్నారు.
‘యాడ్‌ ఏజెన్సీ నేపథ్యంతో నిర్మాతగా మారాను. ఆ అనుభవంతో సినిమా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టాం. రామ్‌మోహన్‌ రెడ్డి సహకారంతో ఈ సినిమాని నిర్మించాం. అందరూ తప్పకుండా ఫ్యామిలీతో చూడదగ్గ చిత్రమిది. తప్పకుండా చిత్రం అన్ని వర్గాల ఆదరణ పొందుతుందనే నమ్మకం ఉంది’.
– నిర్మాత కాసుల భవాని

Spread the love