దళితబందులో దళితుల వద్ద పర్సంటేజీలు తీసుకున్న నీవు అసలు దళితునివేనా

– శాఖాపూర్ గ్రామంలో దండోరా సభలో జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మీ కాంతారావు

నవతెలంగాణ – మద్నూర్
జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమంతు సిండే దళిత బంధు పేరుతో జుక్కల్ నియోజకవర్గం లోని నిజాంసాగర్ మండలంలో దళితుల వద్ద భారీ మొత్తంలో కమిషన్లు దండుకున్నోనివి నీవు అసలు దళితునివేనా.. నీ అవినీతి అక్రమాలపై ప్రజా తీర్పుకు సిద్ధంగా ఉన్నావా రా నిజాంసాగర్ లో కూర్చుందాం దళిత బంధుపై పరిశీలిద్దాం అంటూ తోటా లక్ష్మి కాంతారావు ఎమ్మెల్యే షిండేకు సవాల్ విసిరారు. ఫిబ్రవరి 28న నీవు ఏం మాట్లాడినావు. నేను ఆరు నెలల్లో మళ్లీ ఎమ్మెల్యేగా నేనే వస్తానంటావా చూద్దాం ఆరు నెలల్లో నిరూపించకపోతే ఆరు మాసాల్లో నిన్ను నేను జైల్లో పెట్టడం ఖాయమని ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు కు హెచ్చరించారు. మద్నూర్ మండలంలోని షేకాపూర్ గ్రామంలో దళిత దండోరా నియోజకవర్గస్థాయి సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యంగా విద్యా వైద్యం ఉపాధి కల్పన ఈ మూడింటి పై ప్రత్యేక దృష్టి సాధించడం జరుగుతుందని మాదిగ జాతికి అన్ని రంగాల్లో న్యాయం కోసం ఎంతవరకైనా పోరాడుతానని మాదిగ సమాజానికి హామీ ఇచ్చారు. ఎస్సీ వర్గీకరణ కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృత నిశ్చయంతో ఉన్నారని దానికోసం ఎమ్మెల్యేగా పోరాటం చేస్తానని తెలిపారు. 15 సంవత్సరాల కాలంగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన హనుమంతు సిండే ప్రజల సమస్యలు పట్టించుకోలేదని అవినీతి అక్రమాలకు పాల్పడుతూ.. ప్రజాధనాన్ని దోచుకున్నారని ఆరోపించారు. ఆయన చేసిన అవినీతి అక్రమాల చిట్టా బయటపెట్టే రోజులు దగ్గరపడ్డాయని ఆయనకు జైల్లో పెట్టడం ఖాయమని సభాముఖంగా తెలిపారు. మాదిగ జాతి ప్రతి ఒక్కరూ ఎలాంటి సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని సమస్యల పరిష్కారానికి ఎల్లవేళల అండగా ఉంటానని హామీ ఇచ్చారు. మాదిగ జాతి అన్ని రంగాల్లో ఎదగటానికి తన వంతు సహాయ సహకారాలు కృషి ఎల్లవేళలా ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జుక్కల్ నియోజకవర్గం లోని మాదిగ జాతి ప్రజా ప్రతినిధులు ఎమ్మార్పీఎస్ నాయకులు కుల పెద్దలు యువకులు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Spread the love