
– మీడియా సమావేశం నిర్వహించిన ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి..
నవతెలంగాణ – వేములవాడ
వేములవాడ పట్టణంలో ఆదివారం నాగాయపల్లి గ్రామానికి చెందిన చెట్టి పెళ్లి పరుశరాములు (36) దారుణ హత్యకు గురైన సంఘటన తీవ్ర కలకలం సృష్టించిన విషయం అందరికీ తెలిసిందే. వేములవాడ ఏఎస్పి శేషాద్రిని రెడ్డి తెలిపిన వివరాల మేరకు వేములవాడ శ్రీ నగర్ కాలనీ, చెందిన మృతుడు చెట్టిపెల్లి పరుశురాములు, నిండుతులైన బైరెడ్డి వినయ్, ఈర్ల సాయి, వస్తాద్ అఖిల్, నేదురి రాజేశ్, అడ్డగట్ల మనోజ్ కుమార్ అనువారు గతంలో కలిసి తిరిగేవారని వీరందరి పైన గంజాయి కేసులు, హత్య కేసులు, వివిధ కేసులు వివిధ పోలీస్ స్టేషన్ల లో నమోదు కాగా చాలాసార్లు జైలుకు కూడా వెళ్లి వచ్చినారు. గత కొంతకాలంగా మృతుడైన పరుశురాములు మిగతా ఐదుగురితో ఉండకుండా తన పని తాను చేసుకుంటూ ఇంటి వద్ద ఉంటూ ఉండగా, కొద్ది రోజుల క్రితం ఐదుగురు నిందితుల పైన వివిధ పోలీస్ స్టేషన్ల లో గంజాయి కేసులు నమోదు కాగా, అట్టి గంజాయి కేసులు కావడానికి మృతుడైన పరుశురాములే కారణమని పోలీసులకు సమాచారం ఇస్తున్నాడు అన్న అనుమానంతో ఎలాగైనా పరశురాములను చంపితేనే మాపై గంజాయి కేసులు కావని, సులువుగా గంజాయి వ్యాపారం చేయవచ్చునని, పోలీసులకు దొరకమని, తద్వారా వచ్చిన డబ్బులతో జల్సాలు చేయవచ్చునని అయిదుగురు నిందితులు భావించి గత ఆదివారం రోజున ముందుగా వేసుకున్న పథకం ప్రకారం మృతుడు పరుశరాములు వేములవాడ రెండో బైపాస్ రోడ్డున గల మహా లింగేశ్వర ఫంక్షన్ హాల్ పక్కనగల స్టోర్ రూమ్ బిల్డింగ్ పైన ఒంటరిగా ఉండడం చూసి ఎలాగైనా చంపాలనే ఉద్దేశంతో తమ వెంట తెచ్చుకున్న గొడ్డల్లు, కత్తితో ముగ్గురు నిందితులు అయిన బైరెడ్డి వినయ్, ఈర్ల సాయి, వస్తాద్ అఖిల్ లు మృతున్ని విచక్షణారహితంగా దాడి చేసి చంపినారని మరో నిందితుడు రాజేష్ బయట ఎవరు రాకుండా గేటు వేసినాడని మరో నిందితుడు అయిన అడ్డగట్ల మనోజ్ కుమార్ వీరందరూ జైలుకు వెళ్తే బెయిల్ తీసుకురావడానికి తాను బయట ఉంటానని చెప్పి వీరందరినీ హత్య చేయడానికి పంపించినాడని మృతుని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు వేములవాడ పట్టణ ఇన్స్పెక్టర్ కేసు నమోదు చేసి మంగళవారం ఉదయం 10.00 గంటలకు అయ్యోరు పల్లిగ్రామ శివారులో పట్టుకొని పంచనామా నిర్వహించి నిండుతుల నుండి పరశురాముల్ని చంపడానికి వాడిన రెండు గొడ్డళ్లను, ఒక కత్తిని, 2 బైక్ లను 2 సెల్ ఫోన్ లను స్వాదినపర్చుకున్నాము అని పరారీలో ఉన్న మిగతా నిందితుడు మనోజ్ కుమార్ కోసం గాలిస్తున్నామని వేములవాడ ఏ ఎస్ పి శేషాద్రిన్ రెడ్డి విలేకరుల సమావేశంలో తెలిపారు. ఆమె వెంట పట్టణ సీఐ వీరప్రసాద్,రూరల్ సీఐ శ్రీనివాస్, ఎస్ఐలు రమేష్,వెంకట్రాజ్యం తో పాటు పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు.