చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై కొనసాగుతున్న వాదనలు..

మళ్లీ విచారణ
మళ్లీ విచారణ

నవతెలంగాణ న్యూఢిల్లీ : స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో ఈరోజు మళ్లీ విచారణ ప్రారంభమయింది. చంద్రబాబు తరఫున హరీశ్‌ సాల్వే, సీఐడీ తరఫున ముకుల్‌ రోహత్గీ వాదనలు కొనసాగిస్తున్నారు. విచారణ విధానంపై ఇరుపక్షాల న్యాయవాదులు భిన్నవాదనలు వినిపించారు. 17ఏ చుట్టూనే వాదనలు కొనసాగుతున్నాయి. 17ఏ చంద్రబాబుకు వర్తిస్తుందని కోర్టుకు సాల్వే తెలిపారు. చట్టాన్ని దుర్వినియోగం చేయకుండా 17ఏ కాపాడుతుందని చెప్పారు. ఇదే విషయాన్ని నిన్న కూడా తాను చెప్పానని అన్నారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక ప్రశ్న వేసింది. 17ఏ అనేది ప్రొసీజర్‌ అన్నప్పుడు… అది హక్కుగా వర్తిస్తుందా? అని ప్రశ్నించింది. వాదనలకు ఇంకా ఎంత సమయం తీసుకుంటారని సాల్వేను ధర్మాసనం ప్రశ్నించింది. మరో గంట కావాలని కోర్టును సాల్వే కోరారు.

Spread the love