ఢిల్లీ మద్యం కేసు… కవిత బెయిల్‌ పిటిషన్లపై వాదనలు వాయిదా

Kavitha to CBI custodyనవతెలంగాణ – ఢిల్లీ: ఢిల్లీ మద్యం కేసులో అరెస్టయిన కవిత బెయిల్‌ పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. బెయిల్‌పై మే 27న కౌంటర్ దాఖలు చేస్తామని సీబీఐ తెలిపింది. జూన్ 7న ఛార్జిషీట్‌ దాఖలు చేయనున్నట్లు కోర్టుకు వెల్లడించింది. మరోవైపు కవిత బెయిల్ పిటిషన్‌పై ఈడీ కౌంటర్ దాఖలు చేసింది. ఈ కేసులో వాదనలు వినిపించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు ఈడీ తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. కవిత బెయిల్ పిటిషన్‌పై వాదనలను కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. ఈడీ అరెస్టు చేసిన విధానం, కేసులో కవిత పాత్ర గురించి దర్యాప్తు సంస్థ చెప్పిన విషయాలపై కోర్టుకు కవిత తరఫు న్యాయవాది వివరించారు.

Spread the love