నవతెలంగాణ హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో నాంపల్లి సీబీఐ కోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. నిందితులకు సంబంధించిన 127 డిశ్చార్జ్ పిటిషన్లపై వాదనలు కొలిక్కి వచ్చాయి.
11 సీబీఐ, 8 ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీట్లలో నిందితుల పిటిషన్లపై విచారణ చింది. లిఖితపూర్వక వాదనలు ఉంటే ఇవ్వాలని సీబీఐ, ఈడీ, నిందితులకు సీబీఐ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను న్యాయస్థానం ఈ నెల 15కు వాయిదా వేసింది.