వెట్టి చాకిరిని ప్రతిఘటించిన సాయిధ పోరాటం

Armed struggle against Vetti Chakiri– సీపీఎం మండల పార్టీ కార్యదర్శి రామ్మూర్తి
నవతెలంగాణ-మహబూబాబాద్‌
వెట్టిచాకిరిని ప్రతిఘటించిన పోరాటం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటమని సీపీఎం మండల కార్యదర్శి దుడ్డేల రామ్మూర్తిఅన్నారు.ఆదివారం మహబూబాబాద్‌ మం డలం బలరాం తండా ఆమనగల్లు గ్రామపంచాయతీలలో సీ పీఎంమండల పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రైతాంగ సాయు ధ పోరాట వార్షికోత్సవ సభ గూగుల్‌ అనిమి అధ్యక్షతన జరి గిన కార్యక్రమంలో మండల పార్టీ కార్యదర్శి దుడ్డేల రామ్మూ ర్తి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. సాయుధ రైతాంగ పోరాటం జరుగుతున్న కాలంలోనే భారతదేశానికి స్వాతం త్రం వచ్చిందని, కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో పుచ్చలపల్లి సుందరయ్య నాయకత్వంలో సాగిన ఈ పోరాటం ద్వారా పే దలకు 10 లక్షల ఎకరాల భూమి పంచారన్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం స్ఫూర్తితో ప్రజలంతా తమ హ క్కుల సాధన కోసం ఉద్యమించాలని రామ్మూర్తి పిలుపు ని చ్చారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ సభ్యులు ఇస్లావత్‌ జోగ్యనాయక్‌, చేపూరి గణేష్‌, నాగేల్లి సురేష్‌, గుగులోత్‌ అని మీ, గుగులోతు మంకీ, గుగులోత్‌ గోపి, కిషన్‌ రావు, శంకర్‌, రమేష్‌, ఉమా, రంగమ్మ తదితరులు పాల్గొన్నారు.
సాయుధ పోరాట స్ఫూర్తితో ఉద్యమించాలి సీపీిఐ(ఎం)జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వీరయ్య
మరిపెడ : తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలనుకొనసాగించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అల్వాల వీరయ్య అన్నారు. ఆ దివారం మరిపెడ మండల కేంద్రంలోని తెలంగాణ రైతంగ సాయుధ పోరాట 75వ వార్షికోత్సవ సభను సీపీఐ(ఎం) ఆ ధ్వర్యంలో స్థానిక భార్గవ ఫంక్షన్‌ హాల్లో నిర్వహించారు. ఈ సమావేశానికి పార్టీ ఆర్గనైజర్‌ బాణాల రాజన్న అధ్యక్షత వ హించగా, నాయకులు అలవాల వీరయ్య ముఖ్యఅతిథిగా పా ల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగా ణ రైతాంగ సాయుధ పోరాటం 1946 నుండి 1951 అక్టో బర్‌ 21 వరకు కొనసాగిందని తెలిపారు. 1947 భారతదేశా నికి స్వతంత్రం రాగా నిజం సర్కార్‌ తెలంగాణను భారత దేశంలో విలీనం చేయకుండా నైజాం సర్కార్‌ ఉస్మాన్‌ ఆలీ ఖాన్‌ ఆధీనంలో ఉంచుకున్నారని పేర్కొన్నారు. ఈ పోరా టంలో నైజాం సర్కార్‌ 1500 మందిని బలిదానం చేసుకో గా, కాంగ్రెస్‌ నెహ్రూ సర్కార్‌ 2500 మందిని కాల్చి వేసిం దని తెలిపారు. తెలంగాణ రైతంగ సాయుధ పోరాటంలో 4000 మంది బలిదానం కాగా 3000 గ్రామాలు వెట్టి చా కిరి నుండి విముక్తి పొందినట్లు వివరించారు. 1948 సెప్టెం బర్‌ 17న తెలంగాణ విజయోత్సవం కమ్యూనిస్టులు జరుగు తుండగా దీనికి సంబంధం లేని పార్టీలు అటు బీజెపి ఇటు బీఆర్‌ఎస్‌ విలీనమా.. విద్రోహమా… గందరగోళ ప్రకటన లు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని పే ర్కొన్నారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) మండల కమిటీ సభ్యులు కందాల రమేష్‌, గంధసిరి పుల్లయ్య, మండల కోఆ ప్షన్‌ సభ్యులు ఆల్లి శ్రీనివాస్‌ రెడ్డి, భవన నిర్మాణ కార్మిక సం ఘం జిల్లా అధ్యక్షులు కొండ ఉప్పలయ్య, నాయకులు పసు పులేటి యాదగిరి, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు మధుసూదన్‌, ఇతర ప్రజాసంఘాల నాయకులు ఉన్నారు.
సాయుధ పోరాటానికి వారసులు కమ్యూనిస్టులే…  సీపీఎం జిల్లా కార్యవర్గసభ్యులు బొల్లం అశోక్‌
తొర్రూర్‌ రూరల్‌ : వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి నిజమైన వారసులు కమ్యూనిస్టులే అని సీపీఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు బొల్లం అశోక్‌ పిలుపు నిచ్చారు. ఆదివారం సీపీఎం పార్టీ తొర్రూర్‌ మండల కమిటీ ఆధ్వర్యం లో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట అమరవీరుల స్థూపాలను మండలంలోని కంటాయపాలెం గుర్తురు, అ మ్మాపురం, హరిపిరాల గ్రామాలలో అమరవీరుల స్తూపాల వరకు బైక్‌ ర్యాలీ సీపీఎం పార్టీ మండల కార్యదర్శి ఎండి యాకూబ్‌ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్ర మానికి ముఖ్యఅతిథిగా హాజరైన అశోక్‌ మాట్లాడుతూ బిజెపి అధికారంలోకి వచ్చి 9 సంవత్సరాల కాలంలో ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా కార్పోరేట్‌ శక్తులకు దారాదత్తం చే సి, ధరల స్థిరీకరణ చట్టాలు ఉల్లంఘించి, బిజెపి ప్రజలు వాడుకునే నిత్యవసర వస్తువుల ధరలను ఆహార ధాన్యాలను కత్రిమ కొరత సృష్టించి పేదలపై భారాలు మోపిందని విమ ర్శించారు. రష్యా భారతదేశానికి కారు చౌకగా ఇస్తున్న వంట గ్యాస్‌ను మన దేశ ప్రజలకు ఇవ్వకుండా బడా కార్పొరేట్‌ శక్తు లైన అదాని, అంబానీలకు దారాదత్తం చేసిన ఘనత బిజెపి మోడీది అన్నారు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరి త్ర తెలిసిన ప్రజలే బిజెపికి గుణపాఠం చెప్తారని అన్నారు. సీపీఎం మండల కార్యదర్శి ఎండి యాకుబ్‌ మాట్లాడుతూ మతాల మధ్య చిచ్చుపెట్టే బిజెపి ఎజెండానే కెసిఆర్‌ అమలు చేస్తున్నాడని విమర్శించారు. దళితులకు ఇవ్వవలసిన దళిత బంధు బీఆర్‌ఎస్‌ బంధుగా మారిందని ఆయన విమర్శించా రు. తెలంగాణ అంటేనే కమ్యూనిస్టులు కమ్యూనిస్టులు అం టేనే తెలంగాణని ఎప్పుడైనా తెలంగాణ కమ్యూనిస్టుల అడ్డే నని అని కమ్యూనిస్టుల పోరాటాలను ప్రజలంతా తొందరగా మర్చిపోరని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో మండల క మిటీ సభ్యులు సోమిరెడ్డి, బోర స్వామి, మార్క సాంబయ్య, గుద్దేటి సాయి మల్లు, జమ్ముల శ్రీను, డోనక దర్గయ్య, కంటా యపాలెం ఉపసర్పంచ్‌ గజ్జి రామ్మూర్తి, ఉమా గాని యాక య్య, తిమ్మిడి రవి, తాళ్ల వెంకటేశ్వర్లు ,శంకర్‌, జితేందర్‌ రెడ్డి, రామ్‌ రెడ్డి ,కాయల ఎల్లయ్య, కుమార్‌, సోమన్న , ధరావత్‌ యాకన్న, సుమన్‌ ,గోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.
నిజాం సర్కారును గద్దె దించింది కమ్యూనిస్టులే..
కేసముద్రం రూరల్‌ : రజాకారులపై కమ్యూనిస్టు పార్టీ, ఎర్రజెండా బిడ్డలు విరోచిత పోరాటం సాగించి భూస్వాము ల ఆధీనంలో ఉన్న10లక్షల ఎకరాల భూమిని పంచి 3000 గ్రామాలను విముక్తం చేసిన ఘన చరిత్ర కమ్యూనిస్టులదని, ఎర్రజెండా సొంతమని ఇది ఎవరు కాదనలేని నగసత్యం అ ని సీపీఎం మండల కార్యదర్శి మోడేం, వెంకటేశ్వర్లు ,రైతు సంఘం మండల ప్రధాన కార్యదర్శి బొబ్బల, యాకూబ్‌ రెడ్డి అన్నారు. ఆదివారం తెలంగాణ సాయుధ పోరాట 75వ వార్షికోత్సవ సభ చాగంటి కిషన్‌ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా మోడెం వెంకటేశ్వర్లు, యాకూబ్‌ రెడ్డిలు మా ట్లాడుతూ పది లక్షల ఎకరాల భూమిని కమ్యూనిస్టులు ప్ర జలకు పంచిపెడితే మోడీ ప్రభుత్వం 10 సంవత్సరాల పాల నలో 17 లక్షల కోట్ల పైచిలుకు రూపాయలను మోడీ అను చర గణం భారత ప్రజానీకం యొక్క డబ్బులను దోచుకుని దేశం విడిచి పారిపోయిన కార్పొరేట్‌ బడా చోరులకు వత్తాసు పలుకుతూ పోరాట చరిత్రను వక్రీకరిస్తున్న బిజెపి ఇప్పటికై నా నిజం తెలుసుకొని మాట్లాడాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి జల్లే జయరాజు,రైతు సంఘం మండల అధ్యక్షులు కావటి నరసయ్య, ఐద్వా నాయకురాలు వేల్పుగొండ సావిత్ర, సీపీఎం నాయకులు గోడిశాల వెంకన్న , పుట్ట ముత్తయ్య, కదిరే రాజు, ముద్ర కోలా శ్రీను, ఏనుగు సూరారెడ్డి, ఎండి పాష, మల్లెపాక యాకయ్య, నూకల లక్ష్మ య్య, మాన్సింగ్‌, ఉపేందర్‌ తదితరులు పాల్గొన్నారు.
మోడి, కేసీఆర్‌ పాలనను అంతమొందించాలి
గార్ల : భూ స్వాముల నుండి పేదలకు భూమి పంపిణీ చేసి,వెట్టి చాకిరీ నుండి పేదలను విముక్తి చేసిన మహత్తర మైన వీరతెలంగాణ సాయుధ రైతాంగ పోరాట స్పూర్తితో మోడి, కేసీఆర్‌ పాలనలపై తిరుగుబాటు చేయాలని సీపీఎం మండల కార్యదర్శి కందునూరి శ్రీనివాస్‌ అన్నారు. సీపీఎం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వార్షికోత్సవాన్ని స్దానిక సీపీఎం కార్యాల యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భం గా సాయుధ పోరాట అమరవీరులు దొడ్డి కొమరయ్య,చాకలి ఐలమ్మ,జాటోత్‌ ఠానునాయక్‌, మల్లు స్వరాజ్యంల చిత్ర ప టాలకు పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పిం చారు. అనంతరం జరిగిన వార్షికోత్సవ సభలో శ్రీనివాస్‌ మా ట్లాడుతూ సాయుధ పోరాటంలో లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచడం జరిగిందని, నాలుగు వేల మంది కమ్యూ నిస్టు నాయకులు, కార్యకర్తలు ప్రాణాలు అర్పించారని,లక్షల మంది నిరాశ్రయులుగా మిగిలారన్నారు. బిజెపి, బిఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు రైతాంగ సాయుధ పోరాట చరిత్ర కు ఎన్ని మతం రంగులు పూసిన ముమ్మాటికి తెలంగాణ సాయుధ పోరాట వారసులు కమ్యూనిస్టులే అని స్పష్టం చేశారు. తెలం గాణ రైతాంగ సాయుధ పోరాట స్పూర్తితో కేంద్రంలో మతో న్మాద బీజెపి, రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ నియంత పాలనను అంతమొందంచటానికి సీపీఎం పార్టీ నిర్వహించే పోరాటాల కు ప్రజలు కలిసి రావాలని పిలుపు నిచ్చారు.ఈ కార్యక్రమం లో మండల నాయకులు గడ్డిపాటి రాజారావు, యం.నాగ మణి, ఎ.వీరాస్వామి, బి.లోకేశ్వరావు, ఆర్‌.శ్రీను, రామకృష్ణ, జి.వీరభద్రం, జి.శ్రీను, టి.నాగేశ్వరరావు, ఉప సర్పంచ్‌ కె.మ హేశ్వరావు తదితరులు ఉన్నారు.
చరిత్రను వక్రీకరిస్తున్న బీజేపీనీ తిప్పికొట్టండి సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గునగంటి రాజన్న
నెల్లికుదురు : తెలంగాణ సాయుధ పోరాటం నడిపిన ఘన చరిత్ర కమునిస్టులదని, దీనీకి మతరంగు వేయడానికి బీజేపీ చేసే ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టాలని భారత కమ్యునిస్టు పార్టీ (మార్క్సిస్ట్‌) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గునగంటి రాజన్న పిలుపు నిచ్చారు. సీపీఎం నెల్లికుదురు మండల కమిటి ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్స వాల సమావేశాన్ని ఆదివారం ఈసంపల్లి సైదులు అద్యక్షతన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ1946-51 మధ్య సాగిన వీరోచిత తెలంగాణ సాయుధ పోరాటానికి ప్రపంచ స్థాయి పోరాటా లలో ఒకటిగా గుర్తింపు వచ్చిందని చెప్పారు. హిందూ భూ స్వాములు ముస్లిం రజాకార్లు ఒక్కటై పేద రైతుల్ని చిత్ర హింసలు పెడ్తుండగా అన్ని కులాల, మతాల ప్రజలను సా యుధులుగా తీర్చిదిద్ది కమ్యూనిస్టులు జరిపిన పోరాటం వల్ల 10లక్షల ఎకరాల భూములు పేదలు స్వాధీనం చేసుకోగలి గారు. ఈ సుదీర్ఘ పోరాటంలో గ్రామాలు విముక్తి అయ్యా యని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆవలంబిస్తు న్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలు చేయాలని కో రారు.ఈకార్యక్రమంలో మండల కార్యదర్శి పెరుమాండ్ల తిల క్‌, నాయకులు బాబుగౌడ్‌, తొట నర్సయ్య, పుల్లయ్య, బానా ల యాకయ్య, ఘణపురం ఎల్లయ్య, వెంకన్న పాల్గొన్నారు.

Spread the love