మణిపూర్‌కు తరలిస్తున్న ఆయుధాలు స్వాధీనం

నాగాలాండ్‌ : సరిహద్దు రాష్ట్రమైన నాగాలాండ్‌ నుంచి మణిపూర్‌కి తరలిస్తున్న ఆయుధాలను కోహిమా నగరంలో ప్రత్యేక ఆపరేషన్‌ నిర్వహించి అస్సాం రైఫిల్స్‌ కోహిమా పోలీస్‌లు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు రక్షణ శాఖ ప్రజా సంబంధాల అధికారి మంగళవారం ఓ ప్రకటనను విడుదల చేశారు. స్వాధీనం చేసుకున్న వాటిల్లో రెండు పిస్టల్స్‌, నాలుగు మ్యాగ్‌జైన్స్‌, యుద్ధంలో ఉపయోగించే మందుగుండు సామాగ్రి, పేలుడు పదార్థాలు వంటివి ఉన్నాయి అని పేర్కొన్నారు. కాగా, మణిపూర్‌లో అల్లర్లను పెంచేందుకు నాగాపూర్‌ మీదుగా అక్రమంగా ఆయుధాలను తరలించేందుకు దుండగులు ప్రయత్నిస్తున్నట్లు రైఫిల్స్‌ బలగాలకు సమాచారం అందింది. ఈ సమాచారం మేరకు జూన్‌ 26న తెల్లవారుజామున 2 గంటల సమయంలో అస్సాం రైఫిల్స్‌, కోహిమా పోలీసులు సంయుక్తంగా స్పెషల్‌ ఆపరేషన్‌ని నిర్వహించాయి. ఓ ప్రయాణీకుల వాహనాన్ని గుర్తించి, దానిపై నిఘా పెట్టారు. ఈ తనిఖీల్లో మందుగుండు సామాగ్రి, పేలుడు పదార్థాలను పోలీసులు కనుగొన్నారని పిఆర్‌ఓ ప్రకటన పేర్కొంది.

Spread the love