నవతెలంగాణ-హైదరాబాద్ : ఆర్మీ జవాన్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన నాగర్‌కర్నూల్ జిల్లాలో చోటు చేసుకున్నది. పోలీసుల కథనం మేరకు.. బిజినేపల్లి మండలం మమ్మాయిపల్లికి చెందిన సోల్జర్ శివయ్య(28) కొన్ని రోజుల కిందట సెలవుపై ఇంటికొచ్చాడు. కాగా గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే అనారోగ్య కారణాలతోనే ఇంట్లోని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. అతడికి భార్యతోపాటు ఇద్దరు సంతానం ఉన్నారు. మృతుడి తల్లి నీలమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నటుల ఎస్సై శ్రీనివాస్ తెలిపారు.