నేటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేత

నవతెలంగాణ – అమరావతి : ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో ప్రయివేట్ ఆస్పత్రుల్లో ఇవాళ్టి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోనున్నాయి. పెండింగ్ బిల్లులపై ప్రభుత్వం హామీ ఇవ్వలేదని ఆస్పత్రులు తెలిపాయి. ఇటు ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లోని ఆస్పత్రులు మాత్రం డాక్టర్ ఫీజు, బెడ్ ఛార్జీలు, సర్జరీలు పథకంలో భాగంగా ఫ్రీగా చేసేందుకు ముందుకొచ్చాయి. ఇప్పటికే ఇన్‌పేషెంట్లుగా ఉన్నవారికి ఆరోగ్యశ్రీ పూర్తి వైద్య సేవలు అందిస్తామన్నాయి.

Spread the love