స్ట్రాంగ్‌ రూమ్‌ల్లో ఈవీఎంలు..ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు

నవతెలంగాణ-హైదరాబాద్‌: తెలంగాణలో ఎన్నికల పోలింగ్‌ ముగిసిన నేపథ్యంలో ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌ రూమ్‌ల్లో ఈవీఎంలను భద్రపరిచారు. ఈనెల 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. దీని కోసం జిల్లా కేంద్రాల్లో కౌంటింగ్‌ సెంటర్లను ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌ సహా అన్ని జిల్లా కేంద్రాల్లో పలు విద్యా సంస్థలు, కార్యాలయాల్లో లెక్కింపు కేంద్రాలు సిద్ధం చేస్తున్నారు. పోలీసులు స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఈవీఎంలు భద్రపరిచిన గదుల వద్దకు ఎవరినీ అనుమతించడం లేదు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమయ్యే వరకు ఆయా గదుల వద్ద ఆంక్షలు విధించారు. 144 సెక్షన్‌ అమల్లో ఉంది. గుంపులుగా తిరిగితే చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
జిల్లాల వారీగా కౌంటింగ్‌ సెంటర్ల వివరాలివీ..

Spread the love