– డిప్యూటీ డీఈవో, కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
నవతెలంగాణ-సిటీబ్యూరో
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈవీఎంల పంపిణీ కార్యక్రమాన్ని త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను హైదరాబాద్ జిల్లా ఉప ఎన్నికల అధికారి, కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు. మంగళవారం గోషామహల్, నాం పల్లి, కార్వాన్ నియోజకవర్గాలకు చెందిన డీఆర్సీ కేంద్రాలను సందర్శించి అక్కడ జరుగుతున్న ఈవీఎంలు పంపిణీ కార్యక్రమంతో పాటు ఎన్నికల అధికారులకు చేయాల్సిన భోజన ఏర్పాట్లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ రిటర్నింగ్ అధికారులు, ఇంజ నీరింగ్ అధికారులతో మాట్లాడుతూ ఈవీఎంల పంపిణీకి సంబంధించిన షేడ్స్, కౌంటర్లు, భోజనం తయారి, పంపిణీ చేయటానికి కౌంటర్లు ఎక్కువగా ఏర్పాటు చేసి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు. ఆహారం శుభ్రంగా తయారు చేసి సమయా నికి అందించాలని, ఎలాంటి ఆలస్యం జరగకుండా చూడా లని సూచించారు. షేడ్స్, కౌంటర్లు ఏర్పాటులో ఏమైనా పనులు మిగిలి ఉంటే త్వరగా పూర్తిచేసి సిద్ధంగా ఉంచాల న్నారు. నేడు జరగనున్న ఈవీఎంల పంపి ణీ చాలా జాగ్రత్తగా నిర్వహించాలన్నారు. పోలింగ్ అధికారు లను ఎక్కువసేపు వేచి ఉండకుండా ఎక్కువ కౌంటర్లు ఏర్పా టు చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో రిట ర్నింగ్ అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు, సహాయ రిట ర్నింగ్ అధికారులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.