
పెద్దవూర మండలం నార్జునసాగర్ దయ్యాలగండి పుష్కర ఘాట్ వద్ద గణేష్ విగ్రహాల నిమజ్జనం చేయాలని దానికి తగిన ఏర్పాట్లు చేశామని నగార్జున సాగర్ ఎంఎల్ఏ కుందూరు జయవిర్ అన్నారు. మంగళవారం అక్కడ ఏర్పాట్లను పరిశీలించి మాట్లాడారు. పెద్దవూర మండలం, మరియు ఇతర ప్రాంతాలనుంచి వచ్చే గణేష్ విగ్రహాలను ఇక్కడే నిమజ్జనం చేయాలని తెలిపారు.ఎలాంటి అవాంచ నీయి సంఘటనలు జరుగకుండా పోలీస్ సిబ్బంది అప్రమత్తం కావాలని అన్నారు. సాగర్ కు భారీగా వరద వస్తున్నందున ఎవరైనా దయ్యాలగండిపుష్కర ఘాట్ వద్దనే నిమజ్జనం చేయాలని తెలిపారు.పోలీస్ సిబ్బంది అను వణువణువున గట్టి బందో బస్తు ఏర్పాట్లు చేయాలని అన్నారు.జాతీయ రహదారి కావడం తో వాహనాలు ఎక్కువగా వస్తాయని ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరుగకుండా చూడాలని తెలిపారు.