గ్రూప్‌ వన్‌ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి చేయాలి

– జిల్లా కలెక్టర్‌ టీ. వినయ్‌ కృష్ణారెడ్డి
నవతెలంగాణ-నల్లగొండ కలెక్టరేట్‌
గ్రూప్‌ వన్‌ ప్రిలిమినరీ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ టీ.వినయ్‌ కృష్ణారెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌ కార్యాలయ సమావేశ మందిరంలో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌, గ్రూప్‌ వన్‌ ప్రిలిమినరీ పరీక్షల నిర్వహణ, ఏర్పాట్లపై అదనపు కలెక్టర్‌ భాస్కర్‌రావు, అదనపు ఎస్పీ కేఆర్‌కే.ప్రసాదరావుతో కలిసి పరీక్ష కేంద్రాల చీఫ్‌ సూపరింటెండెంట్‌లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 11 న రోజు జరిగే పరీక్షల నిర్వహణ కోసం జిల్లాలో 51 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు 16095, మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. పరీక్షా కేంద్రాలలో ప్రభుత్వ నిబంధనల మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చెయ్యాలని విద్యత్‌, త్రాగు నీరు, తదితర సౌకర్యాలు ఉండేల సరి చూసుకోవాలని సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఏలాంటి ఇబ్బందులు లేకుండా కట్టుదిట్టమైన భద్రత చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో చీఫ్‌ సూపరింటెండెంట్‌లు తదితరులు పాల్గొన్నారు.

Spread the love