టీడీపీ నేతల అరెస్టు.. మేడిపల్లి పోలీసు స్టేషను కు తరలింపు

నవతెలంగాణ – బోడుప్పల్: టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ఏపీ సర్కారు అక్రమంగా అరెస్టు చేయడంపై నిరసనగా టీడీపీ నేతలు చేపట్టిన నిరసన దీక్షలను అడ్డుకున్నారు. ఈ మేరకు మల్కాజిగిరి పార్లమెంటు టీడీపీ కార్యదర్శి వి‌.సన్న,పీర్జాదీగూడ నగర‌ టీడీపీ అధ్యక్షుడు కూతాడి నరసింహ, టీఎన్ఎస్ఎఫ్ బోడుప్పల్ నగర అధ్యక్షుడు రామోల శ్రవణ్ కుమార్ లను మంగళవారం నాడు మేడిపల్లి సీఐ సైదులు, ఎస్సై క్రిష్ణయ్యల అధ్వర్యంలో అదుపులోకి తీసుకుని స్టేషను కు తరలించారు.ఈ సందర్భంగా టీడీపీ నేతలు మాట్లాడుతూ విజన్ ఉన్న నేతగా పేరున్న చంద్రబాబునాయుడు ను జగన్ సర్కారు కక్ష పూరితంగా అక్రమ పద్ధతులలో అరెస్టు చేసిందని నిరసన వ్యక్తం చేసే స్వేచ్ఛా కూడా ఈ రాష్ట్రంలో లెకుండా పోయిందని వాపోయారు.

Spread the love