
మండలంలోని పైడిపల్లి హనుమాన్ టెంపుల్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఇద్దరి వద్ద 30 గ్రాముల గంజాయి లభించిందని జన్నారం ఎస్సై గుండేటి రాజావర్ధన్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం శనివారం నమ్మదగిన సమాచారం మేరకు పైడిపల్లి హనుమాన్ టెంపుల్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా కామెర నగేష్, బెంబడి పవన్ వద్ద 30 గ్రాముల గంజాయి లభించిందని, దాంతో వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.