అంగన్వాడి ఉద్యోగులను అరెస్ట్ చేయడం సరికాదు

Anganavadiనవ తెలంగాణ మల్హర్ రావు.
తెలంగాణ అంగన్వాడి టీచర్స్ అండ్ హెల్పర్స్ జేఏసీ పిలుపు మేరకు ప్రభుత్వం తమ సమస్యలను పరిస్కారం చేయాలని చట్టబద్ధంగా సమ్మె నిర్వహిస్తున్న అంగన్ వాడి టీచర్లు,ఆయాలను కొయ్యుర్ పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడం సరికాదని,అంగన్వాడి ఉద్యోగులపై సమ్మె విరమించాలని అధికారులు అంగన్వాడి టీచర్లకు ఫోన్లు చేసి వేధిస్తున్నారని ఇతర డిపార్ట్మెంట్ల ఉద్యోగులతో సెంటర్ల తాళాలు పగలగొట్టారని అంగన్ వాడి టీచర్లు పద్మ,అన్నపూర్ణ, జయప్రద, అరుణ ఆవేదన ఆవేదన వ్యక్తం చేశారు.గత తొమ్మిది సంవత్సరాలుగా గర్భిణీ బాలింతలకు పసిపిల్లలకు ఎటువంటి ఆటంకం లేకుండా అంగన్వాడి ఉద్యోగుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందన్నారు. గత్యంతరం లేకనే అంగన్వాడి ఉద్యోగులు రాష్ట్రవ్యాప్తంగా సమ్మెలోకి వెళ్లడం జరిగిందన్నారు,ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం నాయకత్వాన్ని చర్చలకు పిలిచి కనీస వేతనం 26 వేల రూపాయలు,పెన్షన్స్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.అధికారులు అత్యుత్సాహం చెబితే సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

Spread the love