ఉద్యోగుల అరెస్టులు సరైన చర్య కాదు..

– నిరసన తెలిపిన సర్వశిక్షా అభియాన్ సిబ్బంది..
నవతెలంగాణ – అశ్వారావుపేట
సమగ్ర సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగులు ఈ నెల 16 న శాంతియుతంగా నిర్వహిస్తున్న ఛలో హైదరాబాద్ కార్యక్రమానికి మద్దతుగా అశ్వారావుపేట మండల ఉద్యోగులు స్థానిక మండల విద్యా వనరుల కార్యాలయం ముందు నల్లబ్యాడ్జీలు ధరించి ధర్నా నిర్వహించారు. హైదరాబాద్ లో శాంతియుతంగా యస్.పి.డి కార్యాలయం ముందు  నిరసన చేస్తున్నవారిని అరెస్టు చేయడం రాజ్యాంగ విరుద్ధం అని,తమ గోడును పై అధికారులకు నివేదించడం కోసం వచ్చిన వారిని కార్యాలయం లోకి వెళ్లకుండా అడ్డుకోవడం సరైన చర్య కాదని సిబ్బంది అభిప్రాయం పడ్డారు.ఏళ్ల తరబడి వెట్టి చాకిరి చేస్తున్న సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వం ఆలోచించాలని వీరు కోరారు. ఈ కార్యక్రమంలో సి.ఆర్.పిలు ప్రభాకరాచార్యులు, మాళోతు రామారావు, సోమరాజు, రాజు, హనుమంతు, జ్యోతి, మల్లేష్, సి.సి.ఒ మహబూబ్, యం.ఐ.యస్ కో ఆర్డినేటర్ రమేష్ ఐ.ఇ.ఆర్.పిలు  రామారావు, లక్ష్మి, మెసెంజర్ శ్రీను, ఫిజియోథెరపిష్ట్  కిషోర్, తదితరులు పాల్గొన్నారు.
Spread the love