నవతెలంగాణ – హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇవాళ, రేపు కేంద్ర బృందాలు పర్యటించనున్నాయి. కేంద్ర హోంమంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి అనిల్ సారథ్యంలో రెండు బృందాలు ఏపీకి రానున్నాయి. ఇవాళ కృష్ణా, బాపట్ల, రేపు ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో పర్యటిస్తాయి. కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ కీర్తి ప్రతాప్ సింగ్ నేతృత్వంలోని బృందం టీజీలోని ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో పర్యటించనుంది.