నవతెలంగాణ – నసురుల్లాబాద్ (బాన్సువాడ)
కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో నిర్వహించే ఎస్సీ వర్గీకరణ సాధన సభకు ముఖ్య అతిథిగా మహాజననేత మంద కృష్ణ మాదిగ వస్తున్నట్లు సమావేశ నిర్వాహకులు డల్లా సురేష్ తెలిపారు. శనివారం బాన్సువాడ పట్టణంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈనెల 21న బాన్సువాడలో ఎంయస్పీ, ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘాల నియోజకవర్గ సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మహాజన నేత మందకృష్ణ మాదిగ హాజరు కానున్నారని. ఎస్సీ వర్గీకరణ సాధన మహాజన రాజ్యాధికారం లక్ష్యంగా నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కావున మాదిగ, మాదిగ ఉప కులాల యువత అధిక సంఖ్యలో తరలి వచ్చి సభ ను విజయవంతం చెయ్యాలని కోరారు.. ఈ సమావేశంలో ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకుడు దుర్కి బాల్ రాజ్ మాదిగ, ఎంఎస్ఎఫ్ జిల్లా నాయకులు ఎం. శ్రీకాంత్ మాదిగ, ఎమ్మార్పీఎస్ నాయకులు, కల్లూరు గంగారాం, సంగెం సాయిలు, హాన్మండ్లు, సాయిలు తదితరులు పాల్గొన్నారు.