నవతెలంగాణ-హైదరాబాద్ : మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం బావురుగొండలో విషాదం చోటు చేసుకుంది. ఏఆర్ ఎస్సై పడిగ శోభన్‌బాబు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆయన సత్తుపల్లి బెటాలియన్ ఏఆర్ ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్నారు. మెడికల్ లీవ్‌లో సోమవారం ఇంటికి వచ్చిన శోభన్‌బాబు.. పొలం వద్ద ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.